సంగారెడ్డి: 'మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి'

66చూసినవారు
సంగారెడ్డి: 'మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి'
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో పెండింగ్ లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 44 కోట్లు, సదాశివపేటలో 8 కోట్లతో చేపడుతున్న అమృత జల పథకం పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్