మే 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించనున్న సభను జయప్రదం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి కోరారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.