విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన విద్యా రంగానికి 18% నిధులు కేటాయించాలని కోరుతూ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్ తెలిపారు. మల్కాపూర్ లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. ర్యాలీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.