సంగారెడ్డి జిల్లాలో వానాకాలం రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, రెండు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న 2,42,753 మంది రైతులకు రూ.125.83 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ నిధులను రైతులు వర్షాకాలం పంటల సాగుకు ఉపయోగించుకోవాలని సూచించారు.