ధనుర్మాసం సందర్భంగా, సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠాపురం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రథయాత్ర నిర్వహించబడుతుంది. ప్రధాన అర్చకులు వరదాచార్యులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం నాలుగు గంటలకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పట్టణ పురవీధుల మీదుగా శ్రీ వైకుంఠాపురం వరకు ఈ రథయాత్ర జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.