సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రహదారిలో ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ 374 సర్వే నెంబర్లు 900 గజాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు త్రివిక్రమరావు పాల్గొన్నారు.