జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, దివ్యాంగుల కోసం మే నెలలో సదరం షెడ్యూల్ విడుదల చేశారు. మే 5, 13, 20 తేదీల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరం కోసం స్లాట్ నిరంతరం బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. స్లాట్ పేపర్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మెడికల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.