సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద నవంబర్ 5వ తేదీన జరగనున్న సర్దార్ సమ్మేళనం కోసం ఆహ్వాన పత్రికను యాదవ సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణకు శుక్రవారం అందజేశారు. ఈ సదర్ సమ్మేళనం నిర్వహణను వేణుగోపాలకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, శ్రీశైలం యాదవ్ వంటి నాయకులు పాల్గొన్నారు.