జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను వైద్యశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నిబంధనలు పాటించని స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.