సంగారెడ్డి జిల్లాలో ఓ గొర్రెల కాపరి అదృశ్యమయ్యాడు. నారాయణపేటకు జిల్లాకు చెందిన గొర్రెలకాపరి తొల వెంకప్ప గత 2 రోజులుగా కనపడకుండా తప్పిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం సంగారెడ్డి నుండి తన సొంత జిల్లా నారాయణపేటకు వెళ్ళే క్రమంలో తల్లిపోయాడని, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ తెలియలేదని, ఎవరికైనా కనిపిస్తే 7075435014 నెంబరుకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.