సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని శ్రీరామ మందిరంలో శనివారం నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు వేదమంత్రాల నడుమ సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అనంతరం వారి కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీరాముని నామస్మరణతో ఆలయాన్ని మారుమోగించారు.