సైబర్ జాగురుకత దివస్ పేరుతో ఆరు వారాల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం తెలిపారు. 'ఫ్రాడ్ ఫుల్ స్టాప్' పేరుతో జరిగే ఈ కార్యక్రమాల లక్ష్యం సైబర్ నేరాల నియంత్రణకు అవగాహన కల్పించడమేనని ఆయన చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని ఆయన సూచించారు.