సంగారెడ్డిలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో శుక్రవారం రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలని జిల్లా ఆర్టీఓ అధికారి స్రవంతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రవికుమార్ కూడా పాల్గొన్నారు.