ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకుంటేనే రాణిస్తారని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటిఐ సమీపంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. విద్యార్థుల కోసమే ప్రభుత్వం జిల్లాలో మూడు ఐటిసి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రావిణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, ఐటిఐ ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.