సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురంలో శనివారం సుదర్శన నరసింహ హోమ కార్యక్రమం వైభవంగా జరిగింది. దేవాలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాన్ని నిర్వహించారు. అనంతరం, వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ ఆలయ పురవీధులలో ఘనంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు 'జై శ్రీమన్నారాయణ' అంటూ పెద్ద ఎత్తున నామస్మరణ చేశారు.