సంగారెడ్డి: వైకుంఠాపురంలో సుదర్శన నరసింహ హోమం

8చూసినవారు
ధనుర్మాసం పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురంలో శనివారం సుదర్శన నరసింహ హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోమం అనంతరం, వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ ఆలయ పురవీధుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా భక్తులు 'జై శ్రీమన్నారాయణ' అంటూ నామస్మరణతో స్వామివారిని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్