సంగారెడ్డి జిల్లాలో సమ్మేటివ్-1 పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. గత నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షల ప్రశ్నాపత్రాలను వెంటనే దిద్ది, ఫలితాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.