గురువారం నూతన డీఈఓ రోహిణిని టీఎన్జీవో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ రోహిణి మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.