సంగారెడ్డి: మీసేవ కేంద్రాలను తనిఖీ చేసిన తహశీల్దార్

61చూసినవారు
సంగారెడ్డి: మీసేవ కేంద్రాలను తనిఖీ చేసిన తహశీల్దార్
సంగారెడ్డి పట్టణంలోని మీసేవ కేంద్రాలను తహశీల్దార్ జయరాం నాయక్ సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. మీసేవ కేంద్రాల్లో జారీ అవుతున్న పత్రాలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మాత్రమే తీసుకోవాలని తహసిల్దార్ మీసేవ నిర్వాహకులకు సూచించారు. అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్