కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో శనివారం జరిగిన సమావేశంలో సీఐటీయూ, ఐఎన్ టీయూసీ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మల్లేశం, నర్సింహారెడ్డి, రహమాన్ మాట్లాడుతూ, నాలుగు లేబర్ చట్టాలతో కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.