మెదక్ ఎంపీ రఘునందన్ రావు శనివారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికలకు నాలుగు ముక్కలుగా మారుతుందని జోస్యం చెప్పారు. కవిత పార్టీ పెడుతుందని తాను ఏడాది క్రితమే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉందని, అయితే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలకు రిటైర్మెంట్ తీసుకుంటుందని ఆయన అన్నారు.