ఎన్నికల ముందు ఇచ్చిన తులం బంగారం హామీని వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నాటికి తులం బంగారం పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ హామీని నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.