ఇంటికి వచ్చే మున్సిపల్ వాహనంలో తడి పొడి చెత్త వేరువేరుగా వేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని 8, 28 వార్డుల్లో అవగాహన సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించేందుకు వార్డుల వారిగా సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.