విజయదశమి నాటికి మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే విధులు బహిష్కరిస్తామని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సత్తయ్య, కార్యదర్శి దశరథ్ హెచ్చరించారు. సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల వివక్ష చూపుతుందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు వెంటనే విడుదల చేయాలని వారు కోరారు.