మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి బైపాస్ రహదారిలోని ఎస్బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రంలో శనివారం బ్యూటీ పార్లర్ శిక్షణ ముగింపు సమావేశం జరిగింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ మహిళలకు ఎస్బీఐ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రాజేష్ కుమార్ పాల్గొన్నారు.