సంగారెడ్డి: చక్కెర కర్మకారం ముందు కార్మికుల ఆందోళన

5చూసినవారు
సంగారెడ్డి: చక్కెర కర్మకారం ముందు కార్మికుల ఆందోళన
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బీ)లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ముందు కార్మికులు బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. యాజమాన్యాలు మారుతున్నా తమకు న్యాయం జరగడం లేదని కార్మిక సంఘం అధ్యక్షులు ఎంజీ. రాములు ఆరోపించారు. పరిస్థితి మారకుంటే పనులు స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం యూపీ, బీహార్ రాష్ట్రాల నుంచి 300కు పైగా వలస కార్మికులతో పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ కార్మికులు వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్