సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, అబ్దుల్ కలాం స్ఫూర్తితో కలలుకని సాధించుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.