సంగారెడ్డి పట్టణం విద్యానగర్ లోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హరిదాసు, గంగిరెద్దు, రైతు కుటుంబం వేషధారణతో పాటు రంగవల్లులు, గాలిపటాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పాఠశాల చైర్మన్ ఆంథోనీ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు పండుగల విశిష్టత, సంస్కృతి, సాంప్రదాయాలు తెలుస్తాయని, వాతావరణానికి అనుగుణంగా అలవాట్లు మార్చుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.