ఇర్గిపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ అధికారికంగా ప్రారంభించారు. సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామ కార్యదర్శి (సెక్రటరీ) కలిసి భూమి పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సౌకర్యార్థం అంతర్గత రహదారులను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. పనులను ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా, వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రజలు, వార్డు సభ్యులు సహకరించాలని కోరారు.