శివంపేట: హత్య కేసును ఛేదించిన పోలీసులు

55చూసినవారు
శివంపేట: హత్య కేసును ఛేదించిన పోలీసులు
శివంపేట మండలం సామ్యతండాలో శనివారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండాకు చెందిన మదన్ లాల్ ను కత్తితో పొడిచి హత్య చేయగా ఈ కేసుపై తూప్రాన్ సీఐ రంగాకృష్ణ దర్యాప్తు చేపట్టారు. మదన్ లాల్ ను అన్న కొడుకే హత్య చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అతడికి సహకరించిన మరో వ్యక్తిని సైతం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బుధవారం పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్