సంగారెడ్డిలోని కంది జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ దాబాలో శనివారం ఉదయం నుంచి ప్రముఖ మూవీ ఆర్టిస్టులైన వంశీధర్ గౌడ్ (ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఫేమ్), రైటర్ శాలిని, యంగ్ కమెడియన్ వైవా హర్షల కొత్త సినిమా డెమోకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యాక్టర్ డైరెక్టర్ అయిన వంశీధర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. దాబాలో షూటింగ్ సందడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.