సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే, ఆన్ లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.