గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వచ్చే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌లను తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సంగారెడ్డిలోని ఎస్ఎస్ గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, క్యాన్సర్‌పై ఉన్న భయాలు, అపోహలను తొలగించి మహిళల్లో ధైర్యం నింపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.