మహనీయుల చరిత్రను నేటి తరానికి తెలియజేయడానికే జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పాండు ఆదివారం తెలిపారు. ఓడ్డే ఓబన్న 2019 జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో ఓబన్న తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుడని కలెక్టర్ కొనియాడారు.