అంబేద్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లాలో బ్యానర్లు కట్టిన దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మాణిక్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.