సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠంలో సోమవారం దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా త్రయహ్నిక పారాయణ కార్యక్రమం జరిగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి భక్తులకు దత్త దీక్షను అందించారు. మూడు రోజుల పాటు భక్తులు దత్త పారాయణం చేస్తారని, నాలుగవ తేదీన దత్త జయంతి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు.