సంగారెడ్డిలో మంగళవారం జరిగిన యూనియన్ సమావేశంలో, ధరలు గిట్టుబాటు కానందున సెంట్రింగ్ పనులను నిలిపివేయాలని యూనియన్ అధ్యక్షుడు సునీల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ సెంట్రింగ్ పనులు చేపట్టవద్దని ఆయన కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సెంట్రింగ్ ధరలను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఎవరైనా ఈ ఆదేశాలను ధిక్కరించి పనులు చేస్తే జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించారు.