శుక్రవారం, నామినేషన్ల చివరి రోజు కావడంతో సదాశివపేట మున్సిపాలిటీల్లో సందడి నెలకొంది. రాజకీయ నాయకులు భారీ ప్రదర్శనలతో నామినేషన్లు దాఖలు చేయడానికి తరలివచ్చారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. నామినేషన్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.