సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో ఉర్స్ షరీఫ్ ఫీర్ గైబ్ సాహెబ్ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వారంరోజుల పాటు జరిగే ఈ జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు వస్తున్నారు. ఆదివారం జరిగిన పశువుల జాతరలో వేలాది పశువులు తరలిరాగా, కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఉత్తమ పశువులను ఎంపిక చేసి, శిల్పకళాకారులు డాక్టర్ హోత బహుమతులు అందజేస్తారు.