సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్‌ను జిల్లా సంక్షేమ అధికారి కె. లలిత కుమారి తన బృందంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థ అమలులో ఆయన నాయకత్వం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్తమ సేవలు అందించాలని కోరారు.