జిన్నారం మున్సిపల్ నాల్గవ వార్డు స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ వార్డు టికెట్ కోసం కాంగ్రెస్ నాయకురాలు నీలం లత ఆశలు పెట్టుకున్నారు. అయితే, అనూహ్యంగా విజయలక్ష్మికి కాంగ్రెస్ బీ ఫామ్ కేటాయించడంతో, నీలం లత మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. టికెట్లను డబ్బులకు అమ్ముకొని తనకు అన్యాయం చేశారని ఆమె కాంగ్రెస్ నాయకులపై ఆరోపించారు.