ఉపాధి హామీ చట్టం రద్దు చేయాలని కూలీల డిమాండ్

289చూసినవారు
సదాశివపేట మండలం కోల్కూర్ గ్రామంలో శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. నర్సింలు, కూలీలతో సమావేశమయ్యారు. కొత్తగా ప్రవేశపెట్టిన విబి జిరామ్ చట్టం వల్ల కూలీలకు నష్టం జరుగుతుందని, దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ' చట్టాన్నే కొనసాగించాలని కూలీలు కోరారు. సీపీఎం నాయకులు, కూలీలు పాల్గొన్నారు. ఇదివరకు చేసిన పని దినముల డబ్బులు అవకతవకలు జరిగాయని, చేసిన పనికి సరిపడా డబ్బులు రాలేదని కూలీలు తెలిపారు.

సంబంధిత పోస్ట్