కుక్కను ఢీకొని యువకుడికి గాయం, కానిస్టేబుల్ మానవత్వం

0చూసినవారు
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం సూరారం ఎక్స్ రోడ్డు వద్ద కుక్కను ఢీకొని ఓ యువకుడు గాయపడ్డాడు. కానిస్టేబుల్ ప్రభాకర్ గౌడ్ వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం, రోడ్డుపై పడి ఉన్న కుక్క మృతదేహాన్ని తొలగించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేశారు. విధి నిర్వహణతో పాటు మానవత్వంలోనూ పోలీసులు ముందుంటారని నిరూపించిన కానిస్టేబుల్ ను స్థానికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్