రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్

3636చూసినవారు
రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్
అక్కన్నపేట మండలం లచ్చ నాయక్ తండాకు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో మంగళవారం ఓ ట్రాక్టర్ రోడ్డులో దిగబడి ఒకవైపు ఒరిగిన ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇటీవల ఇదే రహదారిపై మరో ట్రాక్టర్ రోడ్డు దెబ్బతినడంతో అదుపుతప్పి పొలంలో పడిన ఘటన కూడా జరిగింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలంలో రహదారి మరింత ప్రమాదకరంగా మారిందని, రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

సంబంధిత పోస్ట్