సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో వ్యక్తి పురుగుల మందు సేవించి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలతో మనోవేదనకు గురైన జనగం పోచయ్య ఈ నెల 3వ తేదీన పురుగుల మందు సేవించాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.