మిరుదొడ్డి: పొలంలో పడి యువకుడు మృతి

2780చూసినవారు
మిరుదొడ్డి: పొలంలో పడి యువకుడు మృతి
సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలంలోని మోతె గ్రామంలో బోరెం హరీశ్ కుమార్ (26) అనే యువకుడు మూర్ఛ వ్యాధితో పొలంలో పడి మృతి చెందాడు. శనివారం వ్యవసాయ పనులకు వెళ్లిన హరీశ్ కు మూర్ఛ రావడంతో నీటి మడుగులో పడి ఊపిరాడక మరణించాడు. మూడేళ్లుగా మూర్ఛతో బాధపడుతున్న హరీశ్, తల్లిదండ్రులతో పాటు భార్యను పోషించుకుంటున్నాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్