సిద్ధిపేట: నీటి సంపులో పడి చిన్నారి మృతి

1340చూసినవారు
సిద్ధిపేట: నీటి సంపులో పడి చిన్నారి మృతి
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు(M)లో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి బాలిక మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన గవ్వల పద్మ రవిలకు ఇద్దరు కూతుళ్ళు. మంగళవారం ఉదయం అరుణ్ తేజ (2.5) ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడిపోయింది. కొద్ది సమయం తర్వాత తల్లి స్నానం కోసం నీళ్లు తోడడానికి వెళ్లగా బాలిక సంపులో శవమై కనిపించింది. దీంతో తల్లి బోరున విలపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్