సిద్దిపేట: కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ

742చూసినవారు
సిద్దిపేట: కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ రెడ్డి నోటీసులు పంపించారని, ఇది కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆరోపిస్తున్నారు. సిట్ నోటీసులను ఖండిస్తూ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో హరీశ్ రావు అత్యవసరంగా భేటీ అయ్యారు.

సంబంధిత పోస్ట్