మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. 'కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో రేవంత్ చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట' అని విమర్శించారు.