సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాతూర్ గ్రామంలో కడుపునొప్పితో బాధపడుతున్న మూడేళ్ల బీంటు అనే బాలుడు చికిత్స పొందుతూ ఏప్రిల్ 7న మృతి చెందాడు. ఏప్రిల్ 5 రాత్రి కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు మొదట గజ్వేల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి, ఆపై హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి సాయిలు ఎలాంటి అనుమానం లేదని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.